పెళ్లి కాలేదని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

ఠాగూర్

సోమవారం, 14 ఏప్రియల్ 2025 (13:46 IST)
అనేక మంది అబ్బాయిలు, అమ్మాయిలకు పెళ్ళిళ్లు కావడం లేదు. వీరిలో ప్రభుత్వ ఉద్యోగులు, టెక్కీలు, ఇంజనీర్లు వంటివారు కూడా ఉన్నారు. అలాంటి వారు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ మహిళా కానిస్టేబుల్ పెళ్లికాలేదని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లాలో చోటుచేసుకుంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జనగామ జిల్లాలోని కొడకండ్ల మండలం నీలిబండ తండాకు చెందిన నీలిమ అనే యువతి 2020లో ఏఆర్ కానస్టేబుల్‌‍గా ఎంపికైంది. శిక్షణ విజయవంతంగా పూర్తిచేసుకుని వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తుంది. ఉద్యోగం వచ్చిన తర్వాత నీలిమకు వివాహం చేసేందుకు తల్లిదండ్రులు అనేక సంబంధాలను చూస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగం ఉడటంతో పెద్ద సంఖ్యలో సంబంధాలు వచ్చినా వచ్చినా ఏదో కారణంతో అవి కుదరడం లేదు. 
 
దీంతో కొంతకాలంగా వివాహ ప్రయత్నాలు నిలిపివేసిన నీలిమ... ఇటీవల మళ్లీ పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టింది. అయితే, ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి కుదరకపోవడంతో నీలిమ అవమాన భారంతో కుంగిపోయింది. ఈ క్రమంలోనే ఆదివారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. దీంతో నీలిబండ తండాలో విషాద చాయలు అలుముకున్నాయి. కానిస్టేబుల్ నీలిమ ఆత్మహత్య చేసుకుందనే సమాచారంతో తండాకు చేరుకున్న పోలీసులు.. ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు