పరగడుపున టమోటాలు, అరటిపండ్లు తీసుకోకూడదా?

శుక్రవారం, 28 ఏప్రియల్ 2017 (16:29 IST)
పరగడుపున అరటిపండ్లు, టమోటాలు తీసుకోకూడదు. పుల్లటి పదార్థమైన టమోటాలను పరగడుపున తీసుకుంటే అల్సర్ సమస్య తప్పదు. చాలామంది టొమాటో రైస్ వంటివి కూడా ఉదయం పూట తీసుకుంటారు. కానీ ఇలాంటి వాటిని తీసుకునేముందు.. ఏదైనా వేరొక ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమం. టమోటాల్లోని పులుపు ద్వారా ఎసిడిటి సమస్య పెరిగే అవకాశం ఉంది. అలాగే అరటి పండును పరగడుపున తీసుకుంటే.. అందులోని మెగ్నీషియం మెగ్నీషియం అందడం అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
అలాగే అల్పాహారంలో నూడుల్స్, మసాలా పదార్థాలు, వేపుళ్లు వంటివి తీసుకోకూడదు. అదీ పరగడుపున అస్సలు తీసుకోకూడదు. వీటిలోని మసాలాలూ, నూనెలు జీర్ణవ్యవస్థ పనితీరుపై ప్రభావం చూపుతాయి. ఇలా ఎక్కువ కాలం తీసుకుంటే అల్సర్‌ బాధించే ఆస్కారం ఉండొచ్చు. కాబట్టి ఇలాంటివి తగ్గించి తేలిగ్గా జీర్ణమయ్యే ఇడ్లీ, అటుకుల ఉప్మా, పండ్లు లాంటివి ఎంచుకోవాలి. 
 
ఇకపోతే.. పరగడుపున ఎన్ని నీళ్లు తాగితే అంత మంచిది. అలాగే మీకు కాఫీ అలవాటు ఉన్నప్పటికీ గంట ముందు కప్పు గ్రీన్ టీ తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రెండుమూడుసార్లు కాఫీ లేదా టీ తాగే అలవాటు ఉన్నవారు ఒకసారి రాగిజావ తీసుకోవచ్చు. తద్వారా శరీరానికి తగిన పోషకాలు అందుతాయి. 

వెబ్దునియా పై చదవండి