భోజనానికి ముందు పండ్లు తీసుకోవద్దు..

ఆదివారం, 13 నవంబరు 2016 (16:42 IST)
యాంటీ ఆక్సిడెంట్లూ, విటమిన్లూ, ఖనిజాలూ, ఫైటోకెమికల్స్‌ అధికంగా ఉండే పండ్లు ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది. జీవక్రియల వేగం మెరుగవుతుంది. వీటిని ఉదయం పూట తీసుకోవచ్చు. అల్పాహారంలోనూ తినొచ్చు. వ్యాయామం తరవాత, మధ్యాహ్నం భోజనం అయ్యాక, సాయంత్రం వేళ తీసుకోవాలి. భోజనానికి ముందు మాత్రం వాటిని తీసుకోకూడదు. అలానే అర్ధరాత్రి వేళ కూడా వీటిని తినకూడదు.
 
అలాగే నట్స్ తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. పీచు, ఎసెన్షియల్‌ న్యూట్రియంట్లు, ప్రొటీన్లు, ఖనిజాలూ, యాంటీఆక్సిడెంట్లు వీటిలో అధికం. వీటిని తీపి పదార్థంతో కలిపి తీసుకోకూడదు. ఉదయం పూట వాకింగ్‌కి వెళ్లేటప్పుడు, పండ్లతో కలిపి తినొచ్చు. అల్పాహారంలో ఓట్స్‌ తింటుంటే.. అందులోనూ వీటిని వేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.

వెబ్దునియా పై చదవండి