ప్రపంచ దేశాల్లో గుండెకు సంబంధించిన వ్యాధితో చనిపోయేవారి సంఖ్య మొదటిస్థానంలో ఉంటె, రెండవ స్థానంలో క్యాన్సర్ వల్ల చనిపోయేవారు ఉన్నారు. క్యాన్సర్ తో మృతి చెందే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితులని ఎదుర్కోవాలంటే వైద్యులకి, వారిచ్చే మందులకి ఎంతో డబ్బు ఖర్చు అవుతుంది.
ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఎంతో మంది శాస్త్రవేత్తలు ఇప్పటికీ క్యాన్సర్ కు విరుగుడు కనుగొనే పనిలో నిమిగ్నమై ఉన్నారు. క్యాన్సర్ ఎలాగైనా, ఎప్పుడైనా మీ శరీరాన్ని ఎటాక్ చెయ్యొచ్చని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. కానీ అది మన దరికి చేరనివ్వకుండా ఉంచాలంటే కొన్ని చిన్న చిన్న పద్ధతులు పాటించక తప్పదు.