ఆకుకూరల్లో దాగివున్న ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకోవాలా అయితే ఈ కథనం చదవండి. తక్కువ ధరలో, ఎక్కువ పోషకాలు లభించే పచ్చని ఆకుకూరల్లో అనారోగ్యాన్ని దూరంగా ఉంచే శక్తి వుంది. ఇవి తింటే ఆరోగ్యంగా జీవించవచ్చు.
పచ్చని ఆకుకూరలు గుండెకు మేలు చేస్తాయి. నడుము చుట్టు కొలతను పెంచనివ్వవు. ముఖ్యంగా తీగబచ్చలి కూరలో విటమిన్లు కె, ఎ, సి, బి2, బి6 ఉన్నాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఫ్రీ రాడికల్స్ హానికరమైన ప్రభావం నుంచి శరీరాన్ని కాపాడుతాయి. ఈ ఆకుల్ని బజ్జీలు, సూప్‌లలో వేయండి. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
మెంతికూరలో క్యాల్షియం, ఇనుము, ఫాస్పరస్‌తో పాటు ప్రోటీన్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇది ఆకలిని పుట్టిస్తుంది. కీళ్ళ నొప్పులను నయం చేస్తుంది. ఒక గుప్పెడు మెంతి ఆకులను పరోటాలలో, చట్నీలలో వేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతాయి.