ఆరోగ్యంగా ఉండాలంటే.. వైట్ రైస్‌-వైట్ బ్రెడ్‌ వద్దే వద్దు.. రోజూ గ్లాస్ వైన్ తీసుకోవచ్చు..

మంగళవారం, 27 డిశెంబరు 2016 (10:34 IST)
ఆరోగ్యంగా ఉండాలంటే.. జీవన శైలిని పాటిస్తూ పోషకాహారం తీసుకుంటే సరిపోతుంది. రోజుకు మూడు గ్లాసుల కాఫీకంటే ఎక్కువగా తీసుకోవద్దు. మద్యం సేవించే అలవాటుంటే.. రోజుకి ఒక్క గ్లాస్ వైన్‌తో సరిపెట్టేయాలి. వైట్ రైస్‌కి, వైట్ బ్రడ్‌కి, పంచదారకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. రోజూ నాలుగు రంగులకు చెందిన పండ్లు, కూరగాయలు తినడం మంచిది. టొమాటోలు తినడం కూడా చాలా మంచిది.
 
ఇంకా ఎరుపు ద్రాక్షలు, డార్క్ చాక్లెట్లు, ఉల్లిపాయలు, వాల్ నట్స్ ఆరోగ్యానికి మంచిది. చేపలు వారానికి రెండు సార్లు తినాలి. అందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి, మీ చర్మ సంరక్షణకు చాలా మంచిది. అలాగే మీ జీవన శైలిని కొంత మార్చుకోండి. రోజుకు కనీసం ఏడు నుండి ఎనిమిది గంటలు నిద్రపోవడం మంచిది.  
 
పొగతాగే అలవాటుంటే మానుకోవాలి. బయిటనుండి వచ్చాక సోప్‌తో చేతులు శుభ్రం చేసుకోండి. ప్రమాదకర‌ బ్యాక్టీరీయా నుండి రక్షణ ఉంటుంది. మానసిక ఒత్తిడి నుండి వీలైనంతగా దూరంగా ఉండంది. కోపాన్ని అధిగమించే పద్దతులని అలవాటు చేసుకోండి. వీలైతే దానికోసం ఓ పెంపుడు జంతువును పెంచుకోండి. నవ్వే సందర్భం వస్తే వీలైనంత ఎక్కువ సేపు నవ్వడానికి ప్రయత్నించండి.
 
పుస్తకాలు చదవడం, నాటకాలు, సినిమాలు చూడడం, క్రాస్ వర్డ్ పజిల్స్ పూర్తి చేయ్యడం అలవాటు చేసుకోండి. దాని వల్ల ఉల్లాసంగా ఉండటమే కాకుండా మీజ్ఞాపక శక్తి మెరుగవుతుంది. విటమిన్ టాబ్లెట్లు, క్యాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవటం మరచిపోవద్దని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి