బరువు తగ్గాలా... అల్పాహారంలో కోడిగుడ్డు ఆరగించండి!

శుక్రవారం, 13 మే 2016 (13:59 IST)
కోడిగుడ్లు అందరి ఇంట్లో సులభంగా దొరికే ఆహార పదార్థం. ఎల్లప్పుడూ తినటానికి వీలుగా ఉండే గుడ్లు చాలా చౌకగా లభిస్తుంది. వీటిలో పోషకాలు, ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. పచ్చసొనలో కొలెస్ట్రాల్‌ అధికంగా ఉంటుందని కొందరు గుడ్లను తినడం పూర్తిగా మానేస్తుంటారు. శరీరానికి ఎండ తగలకపోవటం, సరైన పోషకాహారం తీసుకోకపోవటం వలన చాలామంది విటమిన్‌ 'డి' లోపంతో బాధపడుతూ సతమతమవుతుంటారు. 
 
కోడి గుడ్డులో విటమిన్‌ 'డి' అధికంగా ఉండటం వలన గుడ్లను ఆహారంలో చేర్చుకోవటం ఆరోగ్యానికి చాలా మంచిది. శారీరకశ్రమ బాగా చేసినప్పుడు తిరిగి శక్తిని పుంజుకోవటానికి గుడ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. ఉదయం పూట అల్పాహారంగా గుడ్లను తీసుకుంటే బరువు తగ్గటానికి ఉపయోగపడతాయి. 

వెబ్దునియా పై చదవండి