దానిమ్మతో ఆరోగ్య ప్రయోజనాలు

శనివారం, 25 ఏప్రియల్ 2020 (19:50 IST)
చాలామంది మూత్రపిండాలలో రాళ్ళతో ఇబ్బంది పడుతుంటారు. మధ్య వయస్కులు అయితే పెద్దగా ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదు. వయస్సు పైబడిన వారయితే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలాంటి వారు దానిమ్మ తింటే ఎన్నో ప్రయోజనాలు ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు.
 
పండ్లకే మహారాణి దానిమ్మపండు. ఇందులో థయామిన్, రిబోఫ్లైలిన్ నియాసిన్, విటమిను సి, యాంటీ ఆక్సిడెంట్లు, మానవ శరీరానికి కావాల్సిన విటమిన్లు దానిమ్మ గింజల్లో ఉన్నాయట. 78 శాతం తేమ, పిండి పదార్థాలు, పీచు, మాంసకృతులు, ఖనిజ లవణాలు కూడా ఉన్నాయి.
 
దానిమ్మ గింజలు జీర్ణం కావడానికి 90 నిమిషాల సమయం పడుతుంది. ఈ పండులోని ఖనిజాలు మనం తిన్న ఆహారంలోని ఎ విటమిను కాలేయంలో నిల్వ చేయడానికి తోడ్పతుందట. దానిమ్మ గింజలు గుండెపోటు, పక్షవాతం రాకుండా కాపాడుతూ ధమనుల్లో క్రొవ్వు పేరుకోకుండా ఎంతో బాగా సహకరిస్తుంది. రక్తపోటు, మెనోపాజ్ లక్షణాలను తగ్గిస్తాయి.
 
ప్రతిరోజూ దానిమ్మ గింజలను తింటుంటే జీర్ణాశయంలో క్రిములు చేరవట. ముక్కు నుంచి రక్తం కారుతున్నప్పుడు రెండు చుక్కల దానిమ్మ గింజల రసం వేస్తే రక్తం కారడం ఆగిపోతుందట. గుండె జబ్బుతో బాధపడేవారికి దానిమ్మ గింజలు ఓ వరం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు