ఆ సమయానికి మనిషి నిద్రలేచి తన పనులకు ఉపక్రమిస్తే శరీరంలో ఘర్షణ మొదలై అదికూడా వేడెక్కి శ్వాసతో లీనంకావడంవల్ల వ్యాధులను నిరోధించే సహజశక్తి ఎల్లప్పడూ సంపూర్ణంగా ఉత్పన్నమౌతుంటుంది. అలాకాకుండా మనిషి సూర్యోదయం తర్వాత కూడా నిద్రించడంవల్ల అతని శ్వాసమాత్రం సూర్యప్రభావంతో వేడెక్కి అతని శరీరం చల్లగావుండి ఈ రెండు విరుద్ధమై దాని ఫలితంగా శరీరంలో క్రమంగా వ్యాధినిరోధకశక్తి క్షీణిస్తుంది. తద్వారా అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
ఆయుర్వేదం ప్రకారం రాత్రి తొందరపా నిద్రపోవడం, సూర్యోదయానికి ముందే నిద్రలేచే వారికి ఆరోగ్య సమస్యలు దరిచేరవు. అందువల్లే వాకింగ్ చేయాలి. తద్వారా శరీరానికి విటమిన్ డి లభిస్తుంది. ఈ విటమిన్ ఎముకల పటుత్వాని సహాయపడుతుంది. అంతేగాకుండా ఈ సూర్య కిరణాల కారణంగా అనేక చర్మ వ్యాధులు తగ్గుతాయి.