చాలామందికి అసలు పాలను ఎలా కాచాలో కూడా తెలియదట. సరైన పద్ధతిలో పాలను కాచకుండా ఏదో పొయ్యి పైన పెట్టేసి టీవీలు, ఇతర పనులు చేసుకుంటూ వుంటారట. పాలు పొంగాక కొందరు... పొంగిన తర్వాత బాగా మరగ కాగాక ఇంకొందరు ఇలా ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు పాలను కాస్తుంటారట. అసలు చాలామందికి సరైన పద్ధతిలో పాలను కాచడం తెలియదని ఇండియన్ మెడికల్ అకాడమీ ముంబై, పుణె నగరాల్లో ఆ మధ్య నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది.
ఒకసారి కాచిన పాలను అవసరమైనప్పుడల్లా తిరిగి మళ్లీ అధిక ఉష్ణోగ్రతలో కాచి వాడుతున్నట్టు తెలిసింది. 25-40 ఏళ్ల మధ్య వయసున్న 300 మంది మహిళలను అధ్యయనంలో భాగంగా ప్రశ్నిస్తే... 39 శాతం మంది పాలను మూడు కంటే ఎక్కువ సార్లు కాచి వాడుతున్నారు. 62 శాతం మంది ఐదు నిమిషాల కంటే అధిక సమయం పాటు పాలను కాస్తున్నారట. 72 శాతం మంది పాలను కాస్తున్నప్పుడు గరిటెతో తిప్పడం లేదు.