కొవ్వు పెరగకుండా వుండాలంటే ఎంత నెయ్యి తీసుకోవాలి?

బుధవారం, 18 సెప్టెంబరు 2019 (19:53 IST)
ఒకటి రెండు చిన్న చెంచాల నెయ్యి ప్రతిరోజూ మంచిది. శరీరంలో అధికంగా ఉన్న కొవ్వు కణాల పరిమాణాన్ని తగ్గించడానికి కొద్ది మోతాదులో తీసుకునే నెయ్యి సహాయపడుతుంది కనుక బరువు తగ్గడానికి ప్రయత్నిస్తుంటే నెయ్యి తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు.
 
నెయ్యి దాదాపు 99.5 శాతం కొవ్వును కలిగి వుంటుంది. కాబట్టి తీసుకునే పరిమాణాన్ని తప్పక చూడాలి. 2 చిన్న చెంచాల కంటే ఎక్కువ తీసుకోరాదు. అలాగే, మనకు అవిసె గింజలు, అక్రోట్లను లేదా చేప నూనె వంటి తీసుకునేవారు నెయ్యిని తీసుకోనక్కర్లేదు.
 
నెయ్యిలో అనేక పోషక ప్రయోజనాలు ఉన్నాయి. బరువు తగ్గడంలో మీకు సహాయపడుతుంది, కాని అధికంగా తీసుకుంటే ఏదైనా చెడ్డదే. నెయ్యి విషయంలో కూడా అదే జరుగుతుంది. సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉన్నందున దీనిని మితంగా తీసుకోవాలి. ప్రతిరోజూ ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకోవడం, గరిష్ట ప్రయోజనాలను పొందడం మంచిది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు