మంచి నిద్ర మంచి ఆరోగ్యానికి సూచన. మన ఆరోగ్యం సక్రమంగా ఉందంటే నిద్ర కూడా ప్రశాంతంగా పడుతుంది. ఒకవేళ మన నిద్రలో అనేక సమస్యలు కనిపిస్తున్నాయనుకోండి... అవి మన ఆరోగ్య పరిస్థితికి అద్దం పడుతున్నాయనుకోవచ్చు. ఉదాహరణకు మనకు నిద్రాభంగం కలిగిస్తూ, కనిపించే అనేక సమస్యలు నిజానికి మిమ్మల్ని హెచ్చరిస్తున్నట్లుగా పరిగణించాలి.