లేటుగా తిండి తింటే.. నిద్రెక్కడ పడుతుంది.. శారీరక శ్రమ చాలా అవసరమండోయ్..

బుధవారం, 23 నవంబరు 2016 (13:13 IST)
నిద్రపట్టట్లేదా.. అయితే లేటుగా తిండి తినడం.. మానేయండి. రాత్రి భోజనం లేటుగా తీసుకునే అలవాటుంటే.. వెంటనే మార్చుకోండి. పదికి తర్వాత రాత్రిపూట అన్నం తీసుకుంటే నిద్రలేమి సమస్య తప్పదు. లేటుగా తింటే కడుపులో ఆమ్లాల ఉత్పత్తి పెరిగి, నిద్ర కష్టమవుతుంది. నిద్ర పోవటానికి 2-3 గంటల ముందే భోజనం చేసెయ్యాలి. ఆకలి అనిపిస్తే పడుకోబోయే ముందు ఏదైనా తేలికపాటి చిరుతిండి తినొచ్చు.
 
అలాగే మద్యం సేవించడం.. శారీరక శ్రమ లేకపోవడం కూడా నిద్రలేమికి కారణం అవుతుంది. పగలు కాఫీ టీలు రెండు మూడు కప్పులకంటే ఎక్కువ తీసుకోకండి. నిద్రపోయేందుకు 2-3 గంటల ముందు నుంచీ వీటిని తాగొద్దు. అలాగే ఒంటికి శ్రమ ఉంటేనే తర్వాత విశ్రాంతి తీసుకోగలుగుతుంది. కాబట్టి రోజూ కొంత వ్యాయామం తప్పనిసరి. రాత్రిపూట శ్రమ ఎక్కువగా ఉండే వ్యాయామం చెయ్యొద్దు.
 
5. నిద్రపోయే ముందు ఇంట్లో పెద్ద లైట్లు, ధ్వనులు, టీవీ షోస్‌ వంటివన్నీ బంద్‌ చెయ్యాలి. పడుకోవటానికి ఓ అరగంట ముందు నుంచీ.. సంగీతం వినటం, పుస్తకం చదవటం వంటి మనసుకు ప్రశాంతతనిచ్చే పనులు చెయ్యాలి. నిద్రించేందుకు 15 నిమిషాల ముందు అరటిపండు, ఓ గ్లాసుడు పాలు తీసుకోవడం ఉత్తమం అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి