మునగాకు రసాన్ని తీసుకుంటే అవి తగ్గిపోతాయ్...

మంగళవారం, 18 డిశెంబరు 2018 (10:10 IST)
మునగాకు ఆరోగ్యానికి మంచి ఔషధంగా పనిచేస్తుంది. మునగాకులోని ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ వంటి ఖనిజాలు శరీరాన్ని దృఢంగా తయారుచేస్తాయి. గర్భిణులు తరచు మునగాకు తీసుకుంటే శిశువు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంతే కాదు.. చర్మాన్ని అందంగా, కాంతివంతంగా మార్చుతుంది. ఈ కాలంలో మునగాకు అధిక మోతాదులో తీసుకుంటే.. దానిలోని న్యూట్రియన్ ఫాక్ట్స్ శరీరానికి కావలసిన ఎనర్జీని, పోషక విలువలను అందిస్తాయి. మరి ఈ మునగాకును ఎలా తీసుకోవాలో చూద్దాం..
 
1. మునగాకులను వేడినీటిలో శుభ్రం చేసి ఆపై అందులో కొద్దిగా ఉప్పు, నీరు పోసి బాగా ఉడికించుకోవాలి. కాసేపటి తరువాత ఈ మిశ్రమాన్ని వడగట్టి నూనెలో వేయించి తీసుకుంటే అనారోగ్య సమస్యలు దరిచేరవని చెప్తున్నారు.
 
2. మునగాకు రసాన్ని పారేయకుండా దానిలో కొద్దిగా తేనె, నిమ్మరసం, ఉప్పు కలిపి తాగితే శరీరంలోని చెడు వ్యర్థ పదార్థాలు తొలగిపోతాయి. మునగాకులోని మినరల్స్ కంటి చూపును మెరుగుపరుస్తాయి. 
 
3. మునగాకును శుభ్రం చేసి అందులో కొద్దిగా కందిపప్పు, ఉప్పు, పచ్చిమిర్చి, చింతపండు వేసి బాగా ఉడికించుకోవాలి. ఈ తయారైన మిశ్రమాన్ని తాలింపు పెట్టుకోవాలి. ఆ తరువాత వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి చాలా మంచిది. 
 
4. మునగాకు రక్తంలోని చక్కెర స్థాయిలను క్రమబద్దీకరిస్తుంది. షుగర్ లెవల్స్ తగ్గుతాయి. మధుమేహ వ్యాధిని అదుపులో ఉంచుతుంది. అధిక బరువును తగ్గిస్తుంది. 
 
5. గొంతునొప్పిగా ఉన్నప్పుడు మునగాకు రసాన్ని గొంతుకు రాసుకుంటే తక్షణమే ఉపశమనం లభిస్తుంది. తద్వారా జలుబు, జ్వరం, ఆస్తమా వంటి వ్యాధులకు చెక్ పెట్టవచ్చును. చర్మ సంరక్షణకు కూడా మునగాకు పనికొస్తుంది. చర్మంపై మునగాకు రసాన్ని రాసుకుంటే చర్మం మృదువుగా మారుతుంది. పొడిబారకుండా ఉంటుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు