చికెన్‌ను తెచ్చిన వెంటనే రెండు మూడు గంటల్లో వండుకోవాలి. అలా కాకుండా ఫ్రిజ్‌లో పెట్టి... అమెరికన్లలాగా వారమంతా కొద్దికొద్దిగా వండుకుంటూ ఉంటే.. ఈలోగా ఈ బ్యాక్టీరియా పెరిగి... ఏదో ఒక రోజు పొట్టలో తేడా కొట్టేస్తుంది. ఆస్పత్రి పాలు కావాల్సి ఉంటుంది.. సూపర్ మార్కెట్ వంటి వాటిలో నిల్వ ఉంచిన చికెన్ ను తీసుకోవడం అస్సలు మంచిది కాదట..
కోళ్లఫారంలలో కోళ్లు ఏం తింటాయి. మొక్క జొన్నను కరకరలాడిస్తాయి. అంటే ఫుల్లుగా కొవ్వు పట్టేస్తుంది. ఆ చికెన్ మనం తింటే... మనకూ అదే కొలెస్ట్రాల్ పట్టుకుంటుంది. చికెన్ కొద్దిగా తింటే... బరువు తగ్గొచ్చు. అదే చికెన్ ఎక్కువగా తింటే... బరువు పెరుగుతారు.. చికెన్ తింటే వేడి కదా.. అనుకోవచ్చు.. అది కోళ్ల పెంపకం పై ఉంటుంది.