అర్థరాత్రి పూట ఆహారం.. అయ్య బాబోయ్ అంత డేంజరా?

సోమవారం, 23 సెప్టెంబరు 2019 (10:05 IST)
అర్థరాత్రి పూట ఆహారం తీసుకోవడం అనారోగ్యానికి కారణం అవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎప్పుడుపడితే అప్పుడు తినడం ద్వారానూ వ్యాధులు వెన్నంటి వస్తాయని వారు చెప్తున్నారు. ఆధునికత, ఉద్యోగాల కోసం పరుగులు తీస్తున్న నేటి జనం ఆహారంపై పెద్దగా శ్రద్ధ చూపట్లేదు. రాత్రి పూట ఉద్యోగాల కారణంగా నిద్రను మానుకోవడంతో పాటు సరైన సమయానికి ఆహారం తీసుకోవడంలో వెనుకడుగు వేస్తున్నారు.
 
కొందరైతే లేట్ నైట్ ఫుడ్‌కు అలవాటు పడుతున్నారు. కానీ అర్థరాత్రి పూట తీసుకునే ఆహారంతో మెదడుకు ముప్పు తప్పదని తాజా అధ్యయనంలో తేలింది. నిద్రపోయే ముందు ఆహారం ఎక్కువ మోతాదులో తీసుకుంటే రక్తంలో చక్కెరశాతం పెరగటంతో పాటు కొవ్వుపదార్థాలు పెరిగి గుండె సమస్యలూ సంభవిస్తాయి.
 
వీటితో పాటు మెదడుపై లేట్‌నైట్‌ ఫుడ్‌ అధిక ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనం తేల్చింది. నగరాల్లో ఎక్కువగా రాత్రి పది దాటిన తర్వాత కూడా ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన ఆహారం, స్నాక్స్‌ తీసుకుంటుంటారు. తదేకంగా టీవీ చూస్తూ, సెల్‌ఫోన్‌లో నెట్‌ సర్ఫ్‌ చేస్తూ చిరుతిళ్లు తమకు తెలియకుండా బాగా లాగిస్తుంటారు. ఇలా కేవలం టైంపాస్‌ కోసం రాత్రిపూట తినే చిరుతిళ్లు, జంక్‌ఫుడ్‌ మెదడుపై అధిక ప్రభావాన్ని చూపిస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు