మాంసాహారం ఎక్కువొద్దు.. హృద్రోగ సమస్యలు తెచ్చుకోవద్దు..!

సోమవారం, 12 అక్టోబరు 2015 (18:30 IST)
మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండెబబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ మాంసాహారంలో వుండే ఇనుప ధాతువు (హిమీ ఐరన్) వల్ల హృద్రోగ సమస్యలు వచ్చే అవకాశం వుందని తాజా అధ్యయనాలు తేల్చాయి. హిమీ ఐరన్‌కు, హృద్రోగాలకు ఉన్న సంబంధంపై పరిశోధనలు జరిపారు.

మాంసాహారం ద్వారా శరీరానికి అందే ఇనుప ధాతువు వల్ల గుండెజబ్బులు అధికంగా వచ్చే అవకాశముంది. అదే సమయంలో శాకాహారం ద్వారా అందే ఇనుప ధాతువు (నాన్ హిమీ ఐరన్) వల్ల హృద్రోగాల ముప్పేమీ ఉండదని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. 
 
గొడ్డుమాంసం, చేపలు, పక్షి మాంసాల్లో ఈ హిమీ ఐరన్ అధికంగా ఉంటుంది. శాకాహార ఇనుప ధాతువు కంటే మాంసాహారంలోని ఇనుప ధాతువును శరీరం దాదాపు ఏడురెట్లు వేగంగా శోషణం చేసుకుంటుంది. అయితే శోషణం తరువాత ఇది ఎల్‌డీఎల్ (చెడు కొలెస్ట్రాల్) ఆక్సీకరణంలో ఉత్ప్రేరకంగా పనిచేసి కణజాల క్షీణతకు కారణమయ్యే ప్రమాదముంది. దానివల్ల హృద్రోగ ముప్పు అధికమవుతుందని పరిశోధకులు చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి