సబ్బులతో, షాంపులతో స్నానం చేస్తున్నారా? ఈ సబ్బుల్లో వాడే రసాయనాలు శరీరంలోని కొవ్వు నిల్వలపై ప్రభావం చూపుతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సోపులే కాదు గోళ్ళ రంగులతో కూడా జరజాగ్రత్తగా ఉండాలని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
కానీ, రసాయనాలతో చేసిన సబ్బుల కంటే ఆర్గానిక్ సబ్బులు ఎంతో మేలంటున్నారు. ఇవి మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చాయి. వీటితో స్నానం చేయడం వల్ల సహజ నూనెలను తొలగించకుండా చర్మాన్ని, వెంట్రుకలను శుభ్రం చేస్తాయి. అందువల్ల రసాయనాలతో తయారైన వాటికి బదులుగా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడటం ఎంతో మేలంటున్నారు పరిశోధకులు. పైగా, ఈ ఆర్గానిక్ సబ్బుల వల్ల అదనపు లాభం కూడా ఉంటుందంటున్నారు.
పొగలేని వాతావరణంలో, జంతువుల కొవ్వు లేకుండా వంద శాతం మొక్కల ఉత్పత్తులతో ఆర్గానిక్ ప్రొడక్ట్స్ తయారవుతాయి. వీటి నిల్వ కోసం కూడా రసాయనాలను వాడరు. కాబట్టి వీటి వాడకం వల్ల దుష్ప్రభావాలు తలెత్తే వీలుండదు. ఇక మార్కెట్లో దొరికే ఇతరత్రా సౌందర్య ఉత్పత్తులన్నీ ప్రభావవంతంగా పని చేసినట్టు అనిపించినా ఆరోగ్యానికి చేటు చేస్తాయి. వీటిలోని సోడియం లారేట్ సల్ఫేట్ ఎంతో ప్రమాదకరమైంది.