లెమన్ జ్యూస్ అతిగా తాగేవారు ఇది తెలుసుకోవాల్సిందే

శుక్రవారం, 15 అక్టోబరు 2021 (23:04 IST)
నిమ్మకాయ. ఇందులో విటమిన్ సి తో పాటు.. పొటాషియం, ఫాస్పరిక్‌ యాసిడ్‌, ఐరన్‌ అనే ఖనిజం పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తహీనత నుంచి కాపాడుతాయి. నిమ్మపండుతోని క్షారాలు యూరికామ్లం ప్రభావం నశింపజేస్తుంది.
 
నిమ్మకాయను అనుదినం ఆహారంలో సేవించే వారికి జీర్ణాశయంలోని హాని చేయు క్రిములు నశిస్తాయి. నిమ్మరసం రక్తకణాలలోని కొవ్వును కరిగించి రక్తప్రసరణ సక్రమంగా జరగడంలో ఎంతో ఉపకరిస్తుంది. వాంతులు అయ్యే వారికి ఇస్తే వాంతులు ఆపి, ఆకలిని పెంచుతుంది.
 
అయితే, దీన్ని మోతాదుకు మించి తీసుకుంటే మాత్రం మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. అతిగా ఏ పదార్ధాన్ని తీసుకున్నా ఏదో ఒక అనర్ధం వెన్నంటే ఉంటుందన్న విషయం తెల్సిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు