పాప్ కార్న్‌‌తో మేలెంతో తెలుసా?

ఆదివారం, 4 జూన్ 2017 (16:21 IST)
పాప్ కార్న్‌ ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని ఇటీవల నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది. అందుకే పండ్లు, కూరగాయల సలాడ్స్ వంటి వాటిలో పాప్ కార్న్ కూడా జత చేస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని తేలింది. నూనె, ఇతర మసాలాలు ఉపయోగించకుండా తయారుచేసిన పాప్‌కార్న్‌ను పండ్లతో పాటు తీసుకుంటే బోనస్ ఫలితాలు లభించినట్టేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
పాప్ కార్న్‌లో ఉండే యాంటీయాక్సిడెంట్లు, ఫైబర్ ద్వారా ఏకాగ్రత, జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. జీవితకాలం అనారోగ్యం దరిచేరనివ్వని గుణాలు పాప్ కార్న్‌లో ఫుష్కలంగా ఉన్నాయి. సాధారణంగా ఒక మనిషి రోజుకి 70 శాతం తృణధాన్యాలను తీసుకోవాలి. తృణధాన్యాల్లోకి చేరే పాప్‌కార్న్‌లో తక్కువ క్యాలరీలు, ఎక్కువ పోషకాలుంటాయి. పండ్ల ద్వారా 160 గ్రాముల యాంటీయాక్సిడెంట్లు లభిస్తే.. అంతే మోతాదు గల పాప్‌కార్న్ ద్వారా 300 గ్రాముల యాంటీయాక్సిడెంట్లు ఒంట్లోకి చేరుతాయి. 

వెబ్దునియా పై చదవండి