పేనుకొరుకుడు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

శనివారం, 4 సెప్టెంబరు 2021 (11:54 IST)
ఎంత అందమైన జుట్టు ఉన్నా కొంత మంది పేను కొరుకుడుకు గురయిన వారు ఎంతో మనోవేదనకు గురవుతుంటారు. చాలామంది ఆడవాళ్లు ఎదుర్కునే ప్రధాన సమస్యల్లో పేలు ఒకటి. ఆడవాళ్ళ జుట్టు పొడవుగా ఉండడం వల్ల తలలో పేలు నివాసాన్ని ఏర్పరుచుకుని భలే ఇబ్బంది పెడతాయి. అయితే పేను కొరుకుడు దూరం చేసుకోవాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
 
- చేదుగా ఉన్న పొట్లకాయ ఆకురసంతో వెంట్రుకలు రాలిపోయిన చోట రెండుపూటలా రుద్దాలి.
 
- ఎండిపోయిన పొగాకును బాగా చితక్కొట్టి దానిని కొబ్బరినూనెలో వేసి నానబెట్టాలి. తర్వాత పొగాకును బాగా పిసికి నూనెను వడకట్టాలి. ఆ నూనెను ప్రతిరోజూ రాస్తే పేను కొరుకుడు ఉన్నచోట తిరిగి వెంట్రుకలు మొలుస్తాయి.
 
- వెల్లుల్లిని మెత్తగా గ్రైండ్ చేసి పేస్ట్ చేయండి. దానికి నిమ్మరసం కలపండి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు బాగా పట్టించండి. ఒక అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో జుట్టును శుభ్రం చేయండి. ఆ తర్వాత దువ్వెనతో దువ్వితే పేలు వచ్చేస్తాయి.
 
- రాత్రి పడుకోవటానికి ముందు కొంచెం వైట్ వెనిగర్ తీసుకోని తలకు పట్టించి షవర్ క్యాప్ లేదా టవల్ తో మీ తలను కవర్ చేయాలి. రాత్రి అలా వదిలేసి ఉదయం షాంపూ తో మీ జుట్టును కడిగి, దువ్వెనతో దువ్వితే పేలు బయటకు వస్తాయి.
 
- జుట్టు జిడ్డుగానూ అపరిశుభ్రంగానూ లేకుండా వెంట్రుకల పరిశుభ్రతను పాటించాలి.
 
- దువ్వెనలలో మురికి చేరకుండా దువ్వెన పళ్ళను శుభ్రపరుస్తూండాలి. అంతేకా కుండా వారానికి ఒకసారి మరుగుతున్న నీటిలో దువ్వెనను నానపెట్టి శుభ్రపర
 
- నిమ్మ రసం, వెల్లుల్లి రసం సమంగా తీసుకుని, పేను కొరుకుడు పైన లేపనం చేసుకుంటుంటే. క్రమంగా ఆ ప్రదేశంలో తిరిగి జుట్టు వస్తుంది.
 
- బొప్పాయీ చెట్టు పాలని పేను కొరుకుడు పైన లేపనం చేసుకుంటుంటే. క్రమంగా ఆ ప్రదేశం లో తిరిగి జుట్టు వస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు