మనం ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే రెగ్యులర్ డైట్‌లో తప్పనిసరిగా కొన్ని రకాల పండ్లను చేర్చుకోవాలి. రెగ్యులర్‌గా తీసుకొనే పండ్లు కూరగాయల్లో రకరకాల ప్రోటీన్స్, న్యూట్రీషియన్స్, విటమిన్స్ పుష్కలంగా లభిస్తాయి. ఎండాకాలంలో ఎండ వల్ల శరీరంలో నీరు చాలా వరకూ చెమట రూపంలో బయటకు వచ్చేస్తుంది కాబట్టి, మన శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. కాబట్టి, అలా చెమటరూపంలో కోల్పోయిన నీటిని తిరిగి మన శరీరంలో నిల్వ చేసుకోవాలంటే నీటి శాతం అధికంగా సహజసిద్ధమైన పండ్లను రెగ్యులర్ డైట్‌లో తీసుకోవడం చాలా వరకు మంచిది.
పుచ్చకాయ, ద్రాక్ష, ఆరెంజ్ వంటి పండ్లలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి పండ్లను రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవడం వల్ల శరీరం ఫిట్‌గా ఉండడంతో పాటు, శరీరానికి అవసరం అయ్యే తక్షణ శక్తిని అందిస్తుంది. ఈ హెల్తీ బెస్ట్ ఫ్రూట్స్ రెగ్యులర్‌గా ప్రతి రోజూ తీసుకుంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు.