స్మోక్ చేస్తే బ్రెస్ట్ క్యాన్సర్ తప్పనిసరంటున్న వైద్యులు
శనివారం, 15 అక్టోబరు 2016 (13:42 IST)
బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన వారిలో ప్రతీ ముగ్గురిలో ఒక్కరు తీవ్ర అలసట, ఆయాసాలకు గురవుతున్నారని, ఇందుకుకారణం వారిలో మెదడులోని నరాలు ఒక స్వతంత్ర క్రియా విభాగం సామర్థ్యాన్ని మించి పనిచేయటమేనని తేలింది. సహజ శరీర వ్యవస్థలో తలెత్తే ఈ అసమతుల్యతకు, అలసట బలహీనతకు సంబంధం ఉందని, ఇది బ్రెస్ట్ క్యాన్సర్ రోగులకు మరింత భారమవుతుందని పరిశోధకులు అంటున్నారు.
ఈ విధమైన అలసట, బలహీనతలు కల బ్రెస్ట్ క్యాన్సర్కు గురైన మహిళలు, అదే వయస్సు ఉన్న అలసటలేని వారితో పోలిస్తే 20 ఏళ్లు పైబడిన వారివల్లే కన్పిస్తారని పరిశోధకుల అధ్యయనం తేల్చింది. ఓహియో యూనివర్సిటీకి చెందిన ఇన్సిట్యూట్ ఆఫ్ బిహేవియరల్ మెడిసిన్ రీసెర్చ్(ఐబీఎంఆర్)కు చెందిన క్రిస్టోఫర్ ఫెగున్డెస్, జానైస్ కీకోల్ట్-గ్లాసెర్ బ్రెస్ట్ క్యాన్సర్ రోగుల్లో తలెత్తే అలసటకు కారణమైన జీవకణాలను గుర్తించటానికి గత కొంతకాలంగా పరిశోధనలు చేస్తున్నారు.
ఈ పరిశోధనలోభాగంగా వారు తొలి విజయాన్ని నమోదు చేసుకున్నారు. మనిషి తనకు తెలియకుండానే చేసే పనులైన... శ్వాస, నిశ్వాసలు, హృదయ స్పందన, జీర్ణక్రియ వంటి పనులను నియంత్రించే శరీరంలోని స్వతంత్ర నాడీ వ్యవస్థను లక్ష్యం చేసుకొని తమ పరిశోధనలు సాగించారు. పరిశోధకులు తాము జరిపిన అధ్యయనంలో భాగంగా బ్రెస్ట్ క్యాన్సర్ సోకిన 109 మంది మహిళలను రెండు సమూహాలుగా విభజించారు.
ఒక సమూహంలో దీర్ఘకాలంగా అలసటకు గురవుతున్న వారిని, మరో సమూహంలో ఏ విధమైన అలసటలేనివారిని తీసుకొని వారు చికిత్స తీసుకున్న 2 నెలల నుంచి 2 సంవత్సరాల కాలంలో వారి ఆరోగ్యాన్ని పరిశీలించారు. స్వల్పకాలంలోనే ప్రతి మహిళలో ఒత్తిడికి కారణమయ్యే నోరేపినేఫ్రైన్ అనే హార్మోన్ స్థాయిని తెలుసుకునేందుకు వారి రక్తనమూనాలపై పరీక్షలు జరిపారు. పరిశోధనలో భాగంగా మహిళలు 5 నిమిషాలు ఉపన్యాసం ఇచ్చేలా చేశారు.
ఆ తర్వాత వారికి సామాన్య గణితానికి సంబంధించిన వెర్బల్ సమస్యలిచ్చి మహిళల్లో ఒత్తిడిని పెంచి, ఆ వెంటనే వారి నుంచి సేకరించిన రక్తనమూనాలను ఆ తర్వాత అర్థ గంట తర్వాత సేకరించిన రక్త నమూనాలతో పోల్చిచూడగా నోరేపినే ఫ్రైన్ స్థాయి రెండు సమూహాల్లో సాధారణ స్థాయిని మించి పెరిగాయని అయితే అలసటతో బాధపడే వారిలో ఈ హార్మోన్ స్థాయి ఎక్కువగా పెరిగిందని వెల్లడించారు.