బరువు తగ్గాలా? వంటకు ఆలివ్ ఆయిలే ముద్దు.. సోడా, చిప్స్ వద్దు!

మంగళవారం, 5 జులై 2016 (09:43 IST)
బరువు తగ్గాలంటే ఆలివ్ ఆయిల్‌ను వంటల్లో ఉపయోగించాలని న్యూట్రీషన్లు అంటున్నారు. అలాగే రోజు తినే ఆహారంలో అన్-సాచురేటేడ్ కొవ్వు పదార్థాలు, ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. విత్తనాలు, అవకాడో వంటి రోజువారీ డైట్‌లో చేర్చుకుంటే బరువు తగ్గుతారు. 
 
ప్రతి రోజు తయారు చేసుకునే భోజనం, తినే స్నాక్స్‌లను ఆలివ్ ఆయిల్‌తో తయారు చేసుకోండి. సోడా లేదా చిప్స్ వంటివి తినకండి, వీటికి బదులుగా ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తీసుకోండి. సోడాకి బదులుగా మంచి పండ్ల రసాలను, స్నాక్స్‌ డైట్‌లో చేర్చుకోండి. ఫైబర్‌తో కూడిన ఆహార పదార్ధాలను తీసుకోండి. 
 
తీసుకునే ఆహారంలో ఎక్కువ ఫైబర్స్ ఉండేలా చూసుకోవాలి. ఓట్స్, బ్రోకలి, క్యారెట్, హోల్ గ్రైన్ ఫుడ్, వీట్, విత్తనాలు, గింజలు, బంగాళదుంప, అవకాడో, అరటిపండు వంటి ఎక్కువ ఫైబర్స్ ఉన్న వాటిని డైట్‌లో చేర్చుకుంటే సులభంగా బరువు తగ్గించుకోవచ్చునని న్యూట్రీషన్లు అంటున్నారు. 
 
పిల్లలకు ఎక్కువ క్యాలోరీలు అవసరం, ఎక్కువ క్యాలోరీలను కలిగి ఉండే పాల పదార్థాలను వారు తీసుకోవాలి. తృణధాన్యాలు, ఓట్మీల్, చీస్ ఎక్కువగా ఉన్న ఆమ్లెట్, కాల్చిన బంగాళాదుంపలు సులువుగా బరువు పెరిగేలా చేస్తాయి. ఇక బరువును నియంత్రించుకోవాలంటే వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. 

వెబ్దునియా పై చదవండి