ఎయిర్ కండిషనింగ్ మానవ జీవితంలో ఒక భాగంగా మారింది. ప్రస్తుతం చాలా మంది ఏసీ గాలికి అలవాటు పడుతున్నారు. అయితే శరీరానికి చల్లటి గాలిని అందించినా.. ఎక్కువగా ఎయిర్ కండిషనర్ గాలిని ఎక్కువగా పీల్చడం వల్ల రకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా చిన్న పిల్లలు చర్మ సమస్యలతో పాటు శ్వాసకోశ సమస్యలకు గురవుతారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక మనం ఏసీ వల్ల శరీరంపై ఎలాంటి దుష్ప్రభావాలేంటో తెలుసుకుందాం.
డీహైడ్రేషన్: ఏసీలో ఎక్కువ సమయం గడపడం వల్ల కూడా తరచూ దాహం వేధించే అవకాశం ఉంది. అలాగే, తగినంత నీరు తాగకపోతే డీహైడ్రేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు కొందరికి తలనొప్పి కూడా రావచ్చు. కాబట్టి తరచూ తలనొప్పి సమస్యలతో బాధపడేవారు ఏసీలకు దూరంగా ఉండటం మంచిది.
చర్మం పొడిబారడాన్ని పెంచుతుంది: చర్మ సమస్యలతో బాధపడేవారు ఏసీలో గడపడం మానుకోవాలి. లేదంటే గాలిలో తేమ శాతం తగ్గి చర్మం పొడిబారే అవకాశాలు ఉన్నాయి. దీనితో పాటు, చర్మం తేమ కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే చర్మ సమస్యలతో బాధపడుతున్న వారు ఏసీలుండే ప్రాంతంలో ఉండకూడదని నిపుణులు సూచిస్తున్నారు.