దంతాలకు మేలు చేసే ఆహార పదార్థాలు.. స్మైలీ ఫుడ్స్ అంటే ఏంటో తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదవండి. అనాస, స్ట్రాబెర్రీలతో దంతాలకు మేలెంతో జరుగుతాయి. అలాగే కూరగాయల్లో క్యారెట్, కాలీఫ్లవర్, పెరుగు కూడా దంత సంరక్షణకు సహకరిస్తుంది.
పెరుగూ, జున్ను దంతాలని మెరిపిస్తాయి. క్యాల్షియం, మాంసకృత్తులు అధికంగా ఉండే పదార్థాలు కాబట్టి దంతాలపై ఉండే ఎనామిల్‌ను కాపాడుతుంటాయి. వీటిల్లోని లాక్టిక్ యాసిడ్ దంతాలకి తగిన రక్షణ ఇస్తుంది. పెరుగులోని పాస్ఫరస్ పళ్లపై ఆమ్లాలు పేరుకోకుండా చూసి రంగు మారకుండా సంరక్షిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
ఇంకా క్యారెట్ పంటి ఆరోగ్యానికి సహకరిస్తుంది. క్యారెట్‌ని హల్వాగానో, జ్యూస్‌లా చేసుకోవడం కంటే చక్కగా శుభ్రం చేసి పచ్చిగా తినడం మంచిది. పళ్లపై ఇతర పదార్థాల కారణంగా పేరుకున్న బ్యాక్టీరియా, వ్యర్థాలని ఇది తొలగిస్తుంది. పళ్లకి తగిన వ్యాయామం అంది చిగుళ్లూ బలపడతాయి. కాలీఫ్లవర్ వ్యాధినిరోధక శక్తిని పెంచడంతోపాటూ దంతాలనీ చక్కగా మెరిపిస్తుంది.
ఇక స్ట్రాబెర్రీల్లో మాలిక్ ఆమ్లం ఉంటుంది.. ఇది దంతాలని మెరిపిస్తుంది. వీటిలోని శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్లు పళ్లపై మరకలకి కారణమైన బ్యాక్టీరియాని అదుపు చేస్తాయి. చిగురు వాపు రాకుండా నివారిస్తాయి. ఇంకా దంతాలను సహజంగా శుభ్రపరిచి, దంతాలని మెరిపించే గుణం ఉన్న పండు అనాస. ఇందులోని బ్రొమిలైన్ సహజసిద్ధ క్లెన్సర్‌గా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.