దేహానికి సంపూర్ణ శక్తి అందాలంటే తినాల్సిన ఫుడ్ ఇదే

సిహెచ్

శనివారం, 13 ఏప్రియల్ 2024 (23:01 IST)
ప్రతిరోజు రకరకాల పోషక విలువలున్న ఆహారాలను తినడం ద్వారా మంచి ఆరోగ్యం పొందవచ్చు. సమతుల ఆహారంలో భాగంగా ఇప్పుడు చెప్పుకోబోయే ఆహారాలను చేర్చడం వలన ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. అవేమిటో తెలుసుకుందాము.
 
ముదురు ఆకుపచ్చ ఆకు కూరలు ఫోలేట్, జింక్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, విటమిన్ సి, ఫైబర్ వంటి పోషకాలకి మూలం.
బెర్రీలు తింటుంటే అందులోని విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్ల పోషక శక్తిగా ఉంటాయి.
గ్రీన్ టీ అనేది ఔషధ గుణాలను కలిగినది కావున అది మేలు చేస్తుంది.
కోడిగుడ్లులో ఒకింత కొలెస్ట్రాల్ అధికంగా వున్నప్పటికీ అవి ఆరోగ్యకరమైన ఆహారాలలో ఒకటి.
బాదం, వేరుశెనగ, పొద్దుతిరుగుడు విత్తనాలు, గుమ్మడికాయ గింజలులో ఫైబర్, ప్రోటీన్లు గుండె-ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
వెల్లుల్లిలో మాంగనీస్, విటమిన్ సి, విటమిన్ B6, సెలీనియం, ఫైబర్ వుంటాయి కనుక దీన్ని తీసుకుంటుండాలి.
అల్లంలో బహుళ ఔషధ విలువలున్నాయి కనుక దీనిని కూడా ఆహారంలో తీసుకుంటుండాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు