క్యాన్సర్ సోకిందంటే.. జీవితాన్ని కొద్ది రోజులుగా పొడిగించుకోవాలే తప్ప.. ఎన్నాళ్లు బతుకుతామో గ్యారంటీ ఇవ్వలేని రోగం ఇది. తిరిగి ఆరోగ్యవంతులు కావాలంటే ఎంత సమయం పడుతుందో కూడా చెప్పలేం. ఒకవేళ కోలుకున్నా.. జీవితాంతం వెంటాడే క్యాన్సర్ సమస్యలు.. బతకనీయకుండా చేస్తాయి. క్యాన్సర్ ప్రాణాలను సైతం బలితీసుకుంటుంది.
న్యూయార్క్‌లోని స్లోవన్ కెట్టరింగ్ క్యాన్సర్ సెంటర్ పరిశోధకులు నిర్వహించిన ఓ డ్రగ్ ట్రయల్స్.. క్యాన్సర్ రోగుల్లో కొత్త ఆశలు రేపుతున్నాయి. పెద్ద పేగు కాన్సర్‌తో బాధపడుతున్న 18 మందిపై చేసిన క్లినికల్ ట్రయల్స్ గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. ఆర్నెళ్లలోనే క్యాన్సర్‌ను ఖతం చేసి సరికొత్త చరిత్ర సృష్టించారు సైంటిస్టులు.