కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ హ్యాట్రిక్ కొట్టారు. తాను నటించిన మూడు చిత్రాలు వరుసగా వంద కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టాయి. ఈ నెల 17వ తేదీన విడుదలైన 'డ్యూడ్' చిత్రం కూడా ఏకంగా రూ.100 కోట్ల కలెక్షన్లు దాటేసినట్టు చిత్ర నిర్మాతలు గురువారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు కొత్త పోస్టర్ విడుదల చేసింది. 'బాక్సాఫీసు వద్ద 'డ్యూడ్' సెంచరీ కొట్టింది. దీపావళి సీజన్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది' అని పేర్కొంది. ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం 6 రోజుల్లో ఈ కలెక్షన్లు రాబట్టడం గమనార్హం.
కాగా ప్రదీప్ రంగనాథ్ హీరోగా నటించిన మూడు చిత్రాలు రూ.100 కోట్ల కలెక్షన్స్ రాబట్టడం గమనార్హం. గతంలో 'లవ్‌టుడే', 'డ్రాగన్' మూవీలతో పాటు ఇపుడు డ్యూడ్ మూవీ రూ.100 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ఈ విజయాలతో టాలీవుడ్‌తో తనకంటూ ఓ ఇమేజ్‌ను హీరో సొంతం చేసుకున్నారు.
తెలుగు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై.రవిశంకర్‌లు ఈ చిత్రాన్ని నిర్మించారు. కీర్తీశ్వరన్ దర్శకుడు. ప్రదీప్ రంగనాథన్, మమిత బైజులు హీరోహీరోయిన్లు. సాయి అభయంకర్ సంగీతం సమకూర్చారు. తమిళం, తెలుగు భాషల్లో విడుదల చేశారు. ఈ రెండు భాషల్లో కూడా చిత్ర కలెక్షన్లు అద్భుతంగా ఉండటం గమనార్హం.