రాత్రిపూట పండ్లు తీసుకోవచ్చా.. అనే అనుమానం మీకుందా? అయితే ఈ స్టోరీ చదవండి. రోజువారీగా పండ్లు తీసుకునేటప్పుడు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం మధ్య తీసుకోవడం మంచిదంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. అదే రాత్రిపూట మాత్రం పండ్లు తీసుకోకూడదని వారు సూచిస్తున్నారు. ప్రతి పండులోనూ ''ఫ్రక్టోజు'' పుష్కలంగా ఉంటుంది.
పండ్లు తీసుకున్న కనీసం గంట విరామం తర్వాతే మధ్యాహ్న భోజనం చేయాలి. వారాంతాల్లో అల్పాహారానికి బదులుగా 90 శాతం పండ్లు తీసుకోవడానికి ప్రయత్నించండి. యాపిల్, బొప్పాయి వంటి పిండిపదార్థాలు ఎక్కువగా తీసుకోవడం మంచిది. కానీ ఉదయం అల్పాహారంతోకానీ, మధ్యాహ్నం భోజనంతోకానీ పండ్లు తీసుకోవడం మంచిది కాదు.