మోతాదుకు మించి నీరు ఎక్కువగా త్రాగడం వల్ల ఆరోగ్యానికి హాని జరుగుతుంది. ఒక్కోసారి మరణం కూడా సంభవిస్తుంది. రక్తం ఈ అధిక నీటితో బాగా పలుచబడిపోయి సోడియం గాఢత బాగా పడిపోతుంది. నీటిని బాగా పీల్చుకున్న కణజాలం బాగా ఉబ్బుతుంది. ఈ పరిణామంతో మనిషికి మత్తు ఆవహిస్తుంది. పరిస్థితి అంతటితో ఆగకుండా గాబరా, శక్తి హీనత, తలనొప్పితో పాటు నడవలేని స్థితికి వెళ్లిపోతారు. మితిమీరి ఇంకా నీరు ఎక్కువగా తాగితే శరీరం వణుకడం, వంకర్లు తిరిగిపోవడం... తదితర లక్షణాలతో కోమాలోకి వెళ్లిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి మనిషి తన ఆరోగ్యం కోసం తగిన పరిమాణంలో మాత్రమే నీళ్లు త్రాగాలి.
మనిషికి ఎంత నీరు కావాలంటే...
మనిషి రోజుకు 8 నుంచి 10 గ్లాసుల మంచినీరు తాగవచ్చు. ఐతే ఇది కూడా ఒకేసారి తాగకూడదు. రోజంతా విస్తరిస్తూ తాగాలి. ఇన్ని మంచినీళ్లు తాగితే బాత్రూంకు వెళ్లాలి కదా అనుకోవచ్చు... ఐతే రోజువారీ మూత్రాశయానికి నీటిని అలవాటు చేస్తే కొన్నాళ్లకు ఇలా ఎక్కువసార్లు బాత్రూంకు వెళ్లాల్సిన అవసరం వుండదు. అది కూడా అలవాటు పడుతుంది.