ఆహారాన్ని చేతిలో కలిపి తీసుకుంటే మెదడు, పొట్టకు సంకేతాలిస్తుంది. ఇలా జరిగితే కడుపులో జీర్ణ రసాలు, ఎంజైమ్‌లు విడుదల కావడం ద్వారా జీర్ణశక్తి పెరుగుతుంది. వేళ్ళతో ఆహారాన్ని కలుపుకుని ఉండలుగా తీసుకోవడం ద్వారా రక్తప్రసరణ స్థాయి మరింత వేగవంతమవుతుందట. చేతి వ్రేళ్ళతో ఆహారం తీసుకోవడం వల్ల వ్రేళ్ళు పెదాలకు తగలగానే నోటిలో లాలాజలం ఊరుతుంది. చేతి వ్రేళ్ళ ఆహారం తీసుకుంటే అనారోగ్య సమస్యలు దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.