టెర్రస్‌పైన ఉండే ట్యాంకుల్లో ప్రాణాంతక దోమలు... సూదిపోటుతో రక్తాన్ని తాగేస్తాయ్

గురువారం, 5 జనవరి 2017 (09:23 IST)
పట్టణాలు, నగరాల్లో ఉండే భవనాల టెర్రస్‌పై వాటర్ ట్యాంకులు ఉంటాయి. ఈ ట్యాంకులు ప్రాణాంతక దోమలకు నిలయాలుగా మారుతున్నాయి. కేవలం వాటర్ ట్యాంకులే కాకుండా, ప్లాస్టిక్ డ్రమ్స్, డిసర్ట్ కూలర్స్, ప్లవర్ పాట్స్, ఐరన్ కంటైనర్లు, కనస్ట్రక్షన్ సైట్లలోనే ఈ దోమ‌లు ఎక్కువ‌గా క‌నిపిస్తున్న‌ట్లు తెలిపింది. 
 
దోమల ద్వారా మలేరియా, ఫైలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా, మెదడువాపు వంటి వ్యాధులు వచ్చే ప్రమాదముందన్న విషయం తెలిసిందే. సూది గుచ్చిన‌ట్లు మ‌న‌కు నొప్పిని క‌ల‌గ‌జేస్తూ మ‌నిషి ఒంట్లోని ర‌క్తాన్ని తాగేసే దోమ‌లు ఏయే ప్రాంతాల్లో అధికంగా ఉంటున్నాయ‌న్న అంశంపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ రిపోర్టు త‌యారు చేసినపుడు ఈ విషయం వెల్లడైంది. 
 
ఈ దోమ‌ల్లో 86 శాతం మంచినీళ్ల ట్యాంకుల్లోనే ఉంటున్నట్లు పేర్కొంది. ప్రాణాంతక దోమ‌లు అధికంగా ప్లాస్టిక్ డ్రమ్స్లో 41 శాతం ఉంటున్నాయ‌ని తెలిపింది. డిసర్ట్ కూలర్స్లో 12 శాతం, కనస్ట్రక్షన్ సైట్స్లో ఎక్కువగా వాడే ఐరన్ కంటైనర్లలో 17 శాతం ఉంటున్న‌ట్లు పేర్కొంది. 
 
అలాగే, దేశ వ్యాప్తంగా గత యేడాది డిసెంబరు 31వ తేదీ వ‌ర‌కు 12,225 చికెన్ గున్యా కేసులు, 27,879 డెంగ్యు కేసులు నమోదైనట్టు పేర్కొంది. వచ్చే రెండు నెలల్లో ఈ వ్యాధుల బారిన ప‌డే వారి సంఖ్య‌ మరింత పెరుగనుంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేసింది.  

వెబ్దునియా పై చదవండి