మంకీపాక్స్ వైరస్ కనిపించని దేశాల్లో వ్యాధి, ఆందోళన వ్యక్తం చేస్తున్న నిపుణులు

బుధవారం, 1 జూన్ 2022 (23:11 IST)
మంకీపాక్స్ వైరస్ ముప్పు నిరంతరం పెరుగుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటివరకు 23 దేశాలలో 257 కేసులు నమోదయ్యాయి. సాధారణంగా ఈ వైరస్ కనిపించని దేశాల్లోనే ఈ వైరస్ కేసులు వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఏదేమైనప్పటికీ, ప్రస్తుతం మంకీపాక్స్ వ్యాధితో ఏ రోగి మరణించినట్లు నిర్ధారణ కాకపోవడం ఉపశమనం కలిగించే అంశం.

 
మధ్య ఆఫ్రికాలో మంకీపాక్స్‌ వైరస్‌ వ్యాప్తి చెందడం ఇదే తొలిసారి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారికి ఈ వైరస్ పరివర్తన చెంది, సోకినట్లయితే అది ప్రమాదాన్ని పెంచుతుంది. అటువంటి పరిస్థితిలో అన్ని దేశాలు దీనిని నివారించడానికి కఠినమైన చర్యలు తీసుకోవలసి ఉంటుంది. సోకిన వారితో పరిచయం ఉన్న వ్యక్తులపై నిఘా, పరీక్షలు, ట్రేసింగ్ చేయవలసి ఉంటుంది. ఈ వైరస్ సోకిన దేశాల నుంచి వచ్చే వారిని కూడా ప్రత్యేకంగా పర్యవేక్షించాల్సి ఉంటుంది. అప్పుడే ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు.

 
మంకీపాక్స్ వైరస్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా, భారతదేశంలో కూడా అప్రమత్తం చేసారు. మంకీపాక్స్ సోకిన దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నారు. ఎక్కువ మంది టూరిస్టులు వచ్చే ప్రాంతాల నుంచి శాంపిల్స్‌ను పరీక్షకు తీసుకొస్తున్నారు. భారతదేశంలో ఇప్పటివరకు మంకీపాక్స్ కేసులేవీ బయటపడనప్పటికీ భారతదేశంలో మంకీపాక్స్ వ్యాప్తి చెందితే అది వేగంగా వ్యాప్తి చెందుతుందని నిపుణులు అంటున్నారు. కనుక అప్రమత్తంగా వుండాలని హెచ్చరిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు