మంకీపాక్స్ అనేది మానవ మశూచిని పోలి ఉండే అరుదైన వైరల్ ఇన్ఫెక్షన్. ఇది మొదటిసారిగా 1958లో పరిశోధన కోసం ఉంచబడిన కోతులలో కనుగొనబడింది. 1970లో మంకీపాక్స్ మొదటి మానవ కేసు నమోదైంది. ఈ వ్యాధి ప్రధానంగా మధ్య, పశ్చిమ ఆఫ్రికాలోని ఉష్ణమండల వర్షారణ్య ప్రాంతాలలో కనబడుతుంది. చాలా అరుదుగా ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తుంది.
మంకీపాక్స్ లక్షణాలు ఏమిటి?
మంకీపాక్స్ సాధారణంగా జ్వరం, దద్దుర్లు, వాపు శోషరస కురుపులతో కనిపిస్తుంది. ఇది అనేక ఇతర రకాల వైద్య సమస్యలకు దారితీయవచ్చు. వ్యాధి సాధారణంగా రెండు నుండి నాలుగు వారాల వరకు ఉండే లక్షణాలతో దానంతట అదే పరిమితం అవుతుంది. ఐతే కొన్నిసార్లు తీవ్రమైన అనారోగ్యం కూడా సంభవించవచ్చు.
మంకీపాక్స్ ఎలా వ్యాపిస్తుంది?
మంకీపాక్స్ సోకిన వ్యక్తి లేదా జంతువుతో లేదా వైరస్‌తో కలుషితమైన పదార్థంతో మానవులకు వ్యాపిస్తుంది. ఇది ఎలుకలు, ఉడుతలు ద్వారా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి గాయాలు, శరీర ద్రవాలు, శ్వాసకోశ చుక్కలు, ఇతర కలుషితమైన పదార్థాల ద్వారా వ్యాపిస్తుంది. వాస్తవానికి వైరస్ మశూచి కంటే తక్కువ అనారోగ్యాన్ని కలిగిస్తుంది.
అయితే ఈ ఇన్ఫెక్షన్‌లలో కొన్ని లైంగిక సంపర్కం ద్వారా సంక్రమించవచ్చని గుర్తించారు. స్వలింగ సంపర్కులు లేదా ద్విలింగ సంపర్కులుగా గుర్తించే అనేక కేసులను కూడా పరిశోధిస్తున్నట్లు WHO తెలిపింది. మూడు కారణాల వల్ల ప్రారంభ కేసులు అసాధారణంగా ఉన్నాయని WHO తెలిపింది. మంకీపాక్స్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు ఒకరిని మినహాయించి అన్ని కేసులలో ప్రయాణ చరిత్ర లేదు. చాలావరకు లైంగిక చర్యలు, పురుషులతో లైంగిక సంబంధం కలిగి ఉన్న పురుషులలో గుర్తించబడుతున్నాయి.
మంకీపాక్స్ చికిత్స ఏంటి?
మశూచి నిర్మూలన కార్యక్రమంలో ఉపయోగించిన టీకాలు కొంతమేర సత్ఫలితాలిచ్చాయి. కొత్త వ్యాక్సిన్‌లు అభివృద్ధి చేయబడ్డాయి, వాటిలో ఒకటి వ్యాధి నివారణకు ఆమోదించబడింది. WHO ప్రకారం, మశూచి చికిత్స కోసం అభివృద్ధి చేయబడిన ఒక యాంటీవైరల్ ఏజెంట్ మంకీపాక్స్ చికిత్సకు కూడా లైసెన్స్ పొందింది.