శృంగారంపై ఆసక్తి తగ్గిపోవడానికి కారణాలు ఇవే.. (video)

బుధవారం, 4 జులై 2018 (12:30 IST)
హడావుడి, యాంత్రిక జీవనంతో తీరికలేని పనుల వల్ల అలసిపోవడం కారణంగా స్త్రీపురుషుల్లో శృంగారంపై ఆసక్తి తగ్గిపోతుందని వైద్యులు చెప్తున్నారు. అందుకే తీసుకునే ఆహారం విషయంలో శ్రద్ధ చూపాలని వారు సూచిస్తున్నారు. ప్రొటీన్లు పుష్కలంగా లభించే గుడ్లును రోజూ తీసుకుంటే అలసట దూరమవుతుంది. కోల్పోయిన శక్తిని తిరిగి పొందడానికి తోడ్పడతాయి. అలాగే స్ట్రాబెర్రీ గింజల్లో జింక్ ఎక్కువ వుంటుంది. 
 
వీర్యం ఉత్పత్తికి అవసరమైన పురుష హార్మోన్ టెస్టోస్టీరాన్‌ను జింక్ నియంత్రిస్తుంది. లైంగిక కోరికల ఉద్దీపన కలుగజేస్తుంది. అలాగే రోజుకు రెండు కప్పుల కాఫీ తాగితే శృంగారంపై ఆసక్తిని పెంచుకోవచ్చు. కాఫీలోని కెఫైన్‌ మెటబాలిజాన్ని మెరుగు పరుస్తుంది. రక్తప్రసరణను మెరుగుపరిచి ఫ్యాట్ స్టోర్స్‌ను విడుదల చేస్తుంది. తద్వారా శృంగారం ఆసక్తి పెరుగుతుంది.  
 
బాదం, జీడిపప్పు, అక్రోట్స్ లాంటి నట్స్ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. వీటిలో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచే సెలీనియం, జింక్‌తో పాటు ఇతర పోషకాలు ఉంటాయి. పోషకాహారం తీసుకోవడంతో పాటు వ్యాయామం చేస్తూ ఒత్తిడికి దూరంగా వుండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు