చాలామంది స్త్రీ పురుషులు శృంగారం ముగిశాక నీకెలా ఉందంటే నీకెలా ఉందనే ప్రశ్నలు వేసుకుంటారు. ఈ ప్రశ్న గురించి తెలుసుకునే ముందు... అసలు స్త్రీ, పురుషులకు కామేచ్ఛ ఎందుకు కలుగుతుందని ప్రశ్నలు చాలామందిని వేధిస్తుంటాయి.
పురుషుడి విషయానికి వస్తే సృష్టిరీత్యా అతడికి అందమైన స్త్రీని చూడడం అవశ్యం ఆ భావం కలుగుతుంది. బ్రహ్మచారులలో కామేచ్ఛ అధికంగా వుండడానికి కారణం వారిలోని వీర్యోత్పత్తి, పురుష హార్మోన్ల ప్రభావమే.
వయసు వచ్చాక బయటికి వెళ్లే దారిలేక మోతాదు మించిపోయే వీర్యం, తద్వారా చెలరేగే కోర్కె వారిని సతమతం చేస్తుంది. అవకాశం వచ్చిందంటే ఉచ్ఛనీచాలు మరచిపోతారు. పెళ్లయిన పురుషులలో ఈ యావ తక్కువ అని అనలేం కానీ కుటుంబ బాధ్యతలు అతడి మనసును అనుక్షణం డైవర్ట్ చేస్తుంటాయి.
పరస్త్రీ పొందుకోసం తపించిపోయే వివాహితుడు కూడా తన సంసార చక్రబంధనం గుర్తొచ్చి వెంటనే ట్రాక్‌లోకి వచ్చేస్తాడు. అందుకే అంటారు ఈడు రాగానే పెళ్లి చేసేయాలని. లేకుంటే వారు సమాజానికి తలనొప్పిగా పరిణమించే ప్రమాదం ఎప్పుడూ వుంది.
ఇక స్త్రీలు. వీరికి సంభోగేచ్ఛ ఎందుకు కలుగుతుందో వాత్సాయనుడు వివరించాడు. స్త్రీ వ్యక్తిగత భాగంలోని కండరాలు సహజంగా ఒక విధమైన కోర్కెను పుట్టించేలా వుంటాయి. పురుషుడి వల్ల ఆమె తనలో రేగిన ఆ కోర్కెను తీర్చుకుంటుంది. విశేషమైన ఆ సుఖం ప్రాప్తించినపుడు స్త్రీ తృప్తి చెందుతుంది. మరే సాధనంతోనైనా ఆ కోర్కెను తీర్చుకోవచ్చు కదా అని కొందరు సూచించవచ్చు.
కాని ఆ సాధనాల ద్వారా ఆమెకు నిజమైన సుఖం లభించదు. ఈ విశేష సుఖమే స్త్రీకి ముఖ్యమైనది. పురుషుడికి వీర్య స్కలనం జరిగినప్పుడు ఒకానొక తృప్తి, చెప్పలేని ఆనందం కలుగుతాయి. స్త్రీకి అలాంటి సుఖం లేదు. కానీ ఒకానొక దశలో అనిర్వచనీయమైన సుఖాన్ని పొందుతుంది స్త్రీ. కాబట్టి పురుషుడు ఎక్కువసేపు సంభోగించి ఆమెకు ఆ సుఖాన్ని అందించడమొక్కటే మార్గం.
ఇక్కడో చిత్రం వుంది. స్త్రీ, పురుషులిద్దరూ శృంగారం ముగించాక చివర్లో నీకెలా వుంది? అని ఒకర్నొకరు ప్రశ్నించుకున్నప్పుడు ఎవరూ సమాధానం చెప్పలేరు. ఎందుకంటే పురుషుడి వీర్యస్కలన రూపమైన సుఖం స్త్రీకి తెలీదు. అలాగే స్త్రీకి కలిగే విశేష సుఖం సంగతి పురుషుడికి తెలీదు. కాబట్టి ఈ సుఖం అనిర్వచనీయమైనది. దాని గురించి ప్రశ్నించి ఆ అనిర్వచనీయమైన సుఖాన్ని చెప్పించుకోజాలరు.