శృంగారంలో నేను డౌన్ అయిపోతున్నాను... మా ఆవిడ గోల చేస్తోంది... ఏం చేయాలి?

బుధవారం, 5 జూన్ 2019 (16:14 IST)
ఇటీవలే నాకు పెళ్లయింది. పెళ్లికి ముందు నా భార్యతో శృంగారం ఎంతసేపైనా చేయగలననుకునేవాడిని. కానీ పెళ్లయ్యాక శృంగారంలో నేను డౌన్ అయిపోతున్నాను. నా భార్య ఎక్కువసేపు కావాలని గొడవ చేస్తుంది. నేను మహా అయితే పావుగంటకు మించి చేయలేకపోతున్నాను. ఒకవేళ ఎక్కువసేపు చేస్తే కాళ్లూ చేతులు వణుకుతున్నాయి. నీరసంగా వుంటోంది. శృంగారం ముగిశాక చచ్చుపడిపోయినట్లు పడిపోతున్నాను. ఇదంతా ఆమెకి చెప్తే ఇక నేను పనికిరాను అనకుంటుందేమోనని చెప్పడంలేదు. ఏం చేయాలి?
 
కొత్తగా పెళ్లయిన జంటలు శృంగారంలో బాగానే ఎంజాయ్ చేస్తారు. ఈ ఎంజాయ్‌మెంట్ తొలి యేడాది బాగానే ఉంటుంది. అయితే, కొంతమందికి శృంగారంలో పాల్గొన్న తర్వాత దాహం, ఆకలి అవుతుంది. అలాగే, తలనొప్పి, నీరసం వంటి సమస్యలు కూడా తలెత్తుతుంటాయి. మరికొంతమందికి కాళ్లు చేతులు లాగటం, వణకడం వుంటుంది. ఇలాంటి సమస్యలు పెళ్లయిన కొత్తలో లేక పోయినప్పటికీ.. క్రమేణా వస్తుంటాయి. దీంతో వారు మరింత బాధపడుతుంటారు. శృంగారం చేయడం వల్లే ఇలాంటి సమస్యలు పట్టుకుంటున్నాయేమోనని బెంగపెట్టుకుని జీవిస్తుంటారు. 
 
అలాంటి అనుమానాలకు తావీయరాదు. ఎందుకంటే మనిషి జీవితంలో శృంగారం కూడా ఒక వ్యాయామం వంటిదే. చాలామంది శృంగారంలో పాల్గొన్నాక గ్లాసుడు మంచి నీళ్లు తాగాలనిపిస్తుంది. ఐతే కొందరు శృంగారం చేశాక ఏమీ తినకూడదని చెప్తుంటారు. ఐతే ఆకలైతే హ్యాపీగా ఏం కావాలంటే అది తినొచ్చన్నది వైద్యుల మాట. గ్లాసుడు పాలు కూడా తాగొచ్చు. శృంగారంలో పాల్గొన్నాక కొందరిలో నీరసం, తలనొప్పి వంటివి సహజంగా కన్పించేవే. అందువల్ల ఆందోళన అక్కర్లేదు.
 
ఇలాంటి సమస్య కొంతమందికి మాత్రమే వస్తుంది. దీనికి ప్రధాన కారణం భావప్రాప్తి సమయంలో కొందరు స్త్రీలు కండరాలు తీవ్రంగా బిగించడం వల్ల ఈ నొప్పి వస్తుంది. శృంగారం సమయంలో మనసును రిలాక్స్‌గా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు