శృంగారం కావాలంటే... డబ్బు మాటేంటి అంటున్నారు... ఎన్నారై భర్తతో ఏం చేయాలి?

మంగళవారం, 7 మే 2019 (12:36 IST)
ఫారిన్ సంబంధం అని మా పేరెంట్స్ రెండేళ్ల క్రితం అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్న అబ్బాయితో పెళ్లి చేశారు. ఆయన నన్ను అక్కడికి తీసుకెళ్లడంలేదు. ఏడాదిలో రెండుసార్లు వస్తారు. వారం రోజులుంటారు. ఒక్కసారి శృంగారం చేసి వెళ్లిపోతాడు. నాకు కోర్కెలు విపరీతంగా ఉన్నాయనీ, ఉద్యోగం మానేసి రమ్మన్నాను. సంపాదన లేకపోతే జనం గడ్డిపోచలా చూస్తారనీ, ఓ 10 ఏళ్లు ఓర్చుకుంటే అంతా సర్దుకుంటుందని చెపుతున్నాడు. 
 
నాకుమాత్రం రోజుకు నాలుగైదు సార్లు కావాలనిపిస్తుంది. కోర్కెను అణిచిపెట్టుకోలేకపోతున్నాను. స్వయంతృప్తి మార్గాలను అనుసరిస్తున్నప్పటికీ నావల్ల కావడంలేదు. కోర్కెలు రాకుండా ఏమయినా మందులుంటే చెప్పండి. లేదంటే కంట్రోల్ తప్పి ఏదైనా తప్పుదోవ పడుతానేమోనని భయంగా వుంది...
 
ఇటీవలి కాలంలో ఈ ధోరణులు ఎక్కువవుతున్నాయి. సంపాదనే లక్ష్యంగా పురుషులు పరుగులెడుతున్నారు. పెళ్లి చేసుకోవడం తప్పించి భార్యతో గడిపే రోజులు చాలా తక్కువయిపోతున్నాయి. ముఖ్యంగా ఐటీ ఉద్యోగుల్లో ఇలాంటి పరిస్థితి కనబడుతోంది. భార్య కంటే పనికే ప్రాధాన్యత ఇవ్వడం మామూలవుతోంది. దీనివల్లనే ఇలాంటి పరిస్థితి తలెత్తుతోంది. ఆకలి ఎంత సహజమో శృంగార కోర్కెలు కూడా అంతే సహజం. వాటిని తొక్కి పట్టడం సాధ్యం కాదు. ఇకపోతే, విదేశాల్లో పనిచేస్తున్న భర్త, భార్యను కూడా సాధ్యమయినంత త్వరగా అక్కడికి తీసుకెళ్లగలగాలి. 
 
అలా కానిపక్షంలో స్వదేశానికి తిరిగి వచ్చి ఇక్కడే తగిన ఉద్యోగం చేస్తూ దాంపత్య సుఖాన్ని చవిచూడాలి. భార్య నోరు తెరిచి చెప్పినప్పటికీ పెడచెవిన పెడితే సమస్య తీవ్రమవుతుంది. కనుక ఆయనకు మీ పెద్దల ద్వారానో, లేదంటే స్నేహితుల ద్వారానో నచ్చజెప్పి మీరు అక్కడికి వెళ్లడమో, లేదంటే ఆయన్నే ఇక్కడికి రప్పించడమో చేయండి. కోర్కెలు తగ్గిపోవడానికి మందులేమీ లేవు. కాకపోతే ఆ కోర్కెల నుంచి ధ్యాస మళ్లించేందుకు పుస్తక పఠనం వంటివి చేయవచ్చు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు