మధుర జ్ఞాపకంగా తొలి కలయిక వుండాలంటుంది... అదెప్పుడో చెప్పదు....

మంగళవారం, 13 నవంబరు 2018 (22:38 IST)
నేను ఓ ఐటీ కంపెనీలో పని చేస్తున్నా. మరో ఐటీ కంపెనీలో పని చేసే ఓ అమ్మాయితో పెద్దలు కుదుర్చిన వివాహం చేసుకున్నా. ఆ తర్వాత ఇద్దరం కలిసి హానీమూన్‌కు వెళ్లాం. అక్కడ కనీసం ఆమె తన శరీపైన చెయ్యి వెయ్యనివ్వలేదు. హనీమూన్ ఒక చేదు జ్ఞాపకంగా మిగిలింది. ఆ తర్వాత ఇంటికి వచ్చాక కూడా నాకు శృంగారం కావాలని కోరుతున్నా.. ఆమె మాత్రం ఏదోలా ప్రవర్తిస్తోంది.
 
అదేమని అడిగితే.. మన తొలి కలయిక మరింత మధురంగా ఉండేలా చేస్తానని చెపుతోంది. కానీ అది ఎపుడో చెప్పదు. నేను ఆగలేకపోతున్నా... వివాహం చేసుకుని కూడా దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆమెను బలవంతంగా అనుభవించాలని ఉన్నా అది నాకు ఇష్టం లేదు. నా సమస్యకు పరిష్కార మార్గం చెప్పండి. 
 
చాలామంది యువతులకు శృంగారం పట్ల కొన్ని భయాలు, ఆందోళనలు ఉంటాయి. అందువల్లే ఇలా ప్రవర్తిస్తుంటారు. ముందుగా ఆమె మనసులో ఏముందో తెలుసుకోండి. మీ భార్యతో మరింత చనువుగా ఉండేందుకు ప్రయత్నించండి. మాటలతో దగ్గరవ్వండి. శృంగారం గురించిన ప్రస్తావనకు కాస్త పక్కకు జరిగి ఆమె వ్యక్తిగత ఇష్టాయిష్టాలను తెలుసుకుని ఆ ప్రకారం నడుచుకోండి. ఆమెను ప్రేమతో దగ్గరకు తీసుకుని సుతిమెత్తగా స్పర్శిస్తూ ఉండండి. ఇలా చేస్తూపోతే మీతో కలవక తప్పని స్థితికి ఆమె మనస్సు, శరీరం వస్తుంది. ఆ తర్వాత ఆమె చెప్పినట్టుగానే మధురమైన తొలి కలయిక మీకు మిగులుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు