ఆ సమస్యతో అల్లాడిపోయే పురుషులకు ఇవి దివ్యౌషధంగా...
బుధవారం, 19 జూన్ 2019 (15:15 IST)
చాలామంది మగవారు ఇటీవలి కాలంలో స్తంభన, శీఘ్ర స్కలనం, శృంగారంలో ఎక్కువగా పాల్గొనలేకపోవడం వంటి సమస్యలతో ఇబ్బందిపడుతుంటారు. ఆ సమస్యను పరిష్కరించుకునేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు. స్తంభన సమస్యతో అల్లాడిపోతుంటారు. అయితే కొందరు ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి కొందరు రకరకాల మందుల్ని ఉపయోగిస్తుంటారు. అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు.
1. దానిమ్మ శృంగార శక్తిని బాగా పెంచుతుంది. ప్రతిరోజూ దానిమ్మ తింటే రాత్రంతా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మీరు కోరుకున్నంత సేపు అందులో పాల్గొనవచ్చు. దానిమ్మ రసాన్ని తాగిన తర్వాత కొద్దిసేపటికి అందులో పాల్గొనండి. ఇది 100 శాతం సహజమైనది కాబట్టి మీ ఆరోగ్యంపై కూడా ఎలాంటి దుష్ప్రభావం పడదు. మంచి సంతృప్తి వస్తుంది. ఆ సమయంలో మీ జననేంద్రియాలకు బాగా రక్తప్రసరణ అందుతుంది. అందువల్ల రోజూ మీరు దానిమ్మపండు తినండి. లేదంటే దానిమ్మ రసం తాగండి.
2. పుచ్చకాయ చాలా పవర్‌ఫుల్. పుచ్చకాయలో సిట్రిల్లైన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే నైట్రిక్ ఆక్సైడ్స్ ఉంటాయి. శృంగార శక్తి రావాలంటే పుచ్చకాయ బాగా ఉపయోగపడుతుంది. అందువల్ల రెగ్యులర్‌గా పుచ్చకాయ తింటూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది.
3. గుమ్మడికాయ గింజలులో జింక్, ఒమేగా -3 కొవ్వు యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ హార్మోన్-స్థాయిలను పెంచుతాయి. వీటిని తీసుకోడం వలన మంచి ఫలితం ఉంటుంది.
4. నట్స్, డ్రై ప్రూట్స్ కూడా రెగ్యులర్‌గా తినడం వలన మంచి ఫలితం ఉంటుంది. విటమిన్ B3 ఎక్కువగా నట్స్‌లో ఉంటుంది. డ్రై ప్రూట్స్‌లో వీర్యాన్ని పెంచే గుణాలుంటాయి. వీటిని రెగ్యులర్‌గా తింటూ ఉంటే శృంగార శక్తి బాగా పెరుగుతుంది.
5. బీట్‌రూట్ శృంగార సామర్థ్యం పెంచుకోడానికి ఒక మంచి ఔషధంలా పని చేస్తుంది. బీట్రూట్‌ను తింటే శృంగార శక్తి బాగా పెరుగుతుంది. దీనిలో ట్రిప్టోఫాన్ ఉంటుంది. అందువల్ల దీన్ని రెగ్యులర్‌గా తీసుకుంటే తీసుకుంటే వచ్చే పవర్ కంటే ఎక్కువగా పవర్ వస్తుంది.
6. పురుషుల్లో కాస్త ఏజ్ అయ్యాక ఈస్ట్రోజెన్ స్థాయి పెరుగుతుంది. టెస్టోస్టెరాన్ స్థాయి తగ్గుతుంది. అయితే బ్రోకలీ మీ శరీరంలో టెస్టోస్టెరోన్‌ను పెంచేందుకు బాగా సహకరిస్తుంది. పురుషుల్లో శృంగార హార్మోన్లను పెంచే గుణం బ్రోకలీకి ఉంటుంది.