ఉసిరికాయని నేతిలో వేయించుకుని తీసుకుంటే..?

శుక్రవారం, 28 సెప్టెంబరు 2018 (10:31 IST)
ఈ కాలంలో చలి ఎక్కువగా ఉంటుంది. చాలామందికైతే చలి వలన జలుబు, దగ్గు, తలనొప్పి, తుమ్ములు వంటి సమస్యలు ఎదురవుతాయి. అందుకు వైద్య చికిత్సలు తీసుకుంటుంటారు. అయినా కూడా ఎటువంటి లాభం లేదని బాధపడుతుంటారు. అందుకు ఆయుర్వేదం ప్రకారం ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఉపశమనం లభిస్తుంది. అవేంటో తెలుసుకుందాం.
 
శరీరంలో వ్యాధినిరోధక శక్తి తగ్గిపోవడం వలన ఈ వాతావరణం కారణంగా జలుబు, తుమ్ములు, దగ్గు వంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. మనం తీసుకునే ఆహారంలో కొన్ని పదార్థాలలో రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ కాలంలో దొరికే ఉసిరికాయలు ఈ సమస్యలు మంచి పరిష్కారం. అందుకు ప్రతిరోజూ ఉసిరికాయను నేతిలో వేయించుకుని తేనెలో కలుపుకుని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. 
 
ఇంగువ చూర్ణాన్ని వేడినీటిలో మరిగించుకుని అందులో కొద్దిగా ఆవునెయ్యి కలుపుకుని ప్రతిరోజూ మూడుపూటలా సేవిస్తే ఆయాసం, తలనొప్పి వంటి సమస్యలు దరిచేరవు. అయినా కూడా తగ్గలేదనుకుంటే వాము చూర్ణాన్ని, పటిక బెల్లాన్ని వేడినీళ్లల్లో మరిగించుకుని తీసుకుంటే వెంటనే ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు