బ్రష్ మీద కొంచెం కర్పూరం పొడి వేసుకుని... ఆ తర్వాత..

బుధవారం, 13 డిశెంబరు 2017 (21:00 IST)
కర్పూరంలో చాలా రకాలు ఉన్నప్పటికీ తెల్లకర్పూరం, పచ్చకర్పూరం ప్రసిద్ధి. భారతదేశంలో అన్ని ప్రదేశాల వారు కర్పూరాన్ని మంగళ ప్రదాయనిగా భావిస్తుంటారు. కర్పూరంలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. కర్పూరాన్ని నీళ్ళలో కలుపుకుని తాగితే కలుషిత నీళ్ళు శుభ్రపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
 
మన శరీరంపైన చాలా సూక్ష్మజీవులు మనకు తెలియకుండానే జీవిస్తూ ఉంటాయి. మనం ప్రతిరోజు స్నానం చేసే నీటిలో కొంచెం కర్పూరాన్ని వేసుకుని స్నానం చేస్తే శరీరంపై ఉన్న సూక్ష్మక్రిములన్నీ చచ్చిపోతాయి. కొన్ని కర్పూరం బిళ్ళలను మూటలాగా చేసి రాత్రి పడుకునే ముందు మన మీద వేసుకుని పడుకుంటే మన శరీరంలో రక్తప్రసరణ బాగా జరుగుతుంది. 
 
కర్పూరం శరీరంలోని జీర్ణక్రియను బాగా మెరుగుపరుస్తుంది. అంతేకాదు బ్రష్ మీద కొంచెం కర్పూరం పొడి వేసుకుని ఆ తరువాత పేస్ట్ వేసుకుని బ్రష్ చేస్తే దంత వ్యాధులు దరిచేరవు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు