పిల్లలకు అజీర్తి, కడుపునొప్పి వస్తే ఒక స్పూను అల్లం రసం కానీ చిటికెడు శొంఠి పొడి కానీ ఇస్తే తక్షణ ఉపశమనం లభిస్తుంది. అలాగే, పెద్దవాళ్లు మోతాదుకు సరిపడా తీసుకోవచ్చు.
జలుబు, ఫ్లూ జ్వరంతో బాధపడుతున్నప్పుడు తేనెలో అల్లం ముక్కలు కాని, శొంఠిపొడి కాని కలిపి తీసుకోవాలి. తలనొప్పి, జర్వం ఉన్నప్పుడు అల్లం రసం కాని, అల్లం టీ కాని తాగితే ఉపశమనం కలుగుతుంది.
జలుబు, దగ్గుతో బాధపడుతున్నప్పుడు రోజుకు మూడుసార్లు అల్లంతో తయారైన హెర్బల్ టీని తాగచ్చు. అయితే రోజులో నాలుగు సార్లకు మించి అల్లం టీ తాగితే ఆరోగ్యానికి మంచిది కాదు. మరీ ముఖ్యంగా కడుపులో అల్సర్ ఉన్న వాళ్లు అసలు తాగకూడదు.