ఫ్యాట్ కంటెంట్ ఫుడ్ తీసుకున్నారా? ఐతే అరకప్పు ద్రాక్షలు తినండి

గురువారం, 18 ఆగస్టు 2016 (12:30 IST)
ఊబకాయం, హైపర్ టెన్షన్, డయాబెటిస్ వల్ల కలిగే సమస్యలను తగ్గించుకోవడంలో ద్రాక్షపండ్లు దివ్యౌషధంగా పనిచేస్తాయి. నీటి శాతం అధికంగా ఉండే ద్రాక్షల్ని  రెగ్యులర్‌ డైట్‌లో చేర్చడం వల్ల ఊబకాయం సమస్యలు ఉండవు. పాలీఫినోల్స్‌గా పిలిచే ద్రాక్షల్లో యాంటీఆక్సిడెంట్లు.. శరీరంలోని కొవ్వును కరిగించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. 
 
జీవక్రియలు సాఫీగా సాగేందుకు ఇవి దోహదం చేస్తాయి. బాడీలో గ్లూకోజ్‌ లెవల్స్‌ను స్థిరీకరించే శక్తి కూడా ద్రాక్ష పళ్లకు ఉంది. ఫ్యాట్‌ కంటెంట్‌ అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాల్సి వచ్చిన రోజున.. అరకప్పు ద్రాక్షలు తీసుకుంటే మంచిది. ఇవి ఫాట్‌ను బర్న్ చేయడంతో పాటు కొలెస్టరాల్ లెవల్స్‌ను క్రమబద్ధీకరిస్తాయి. తద్వారా అనవసరపు ఫాట్ తగ్గుతుంది. శరీరానికి ఆరోగ్యం చేకూరుతుంది. 

వెబ్దునియా పై చదవండి