2. పిప్ళిళ్ళను నేతిలో వేయించి, మెత్తగా దంచాలి. శొంఠిని కూడా నిప్పులమీద కాల్చి, మెత్తగా దంచి, రెంటిని సమానంగా కలిపి, బెల్లంతో నూరి తింటుంటే శరీరానికి నీరు లాగేస్తుంది. కీళ్ళ నొప్పులు, నడుంనొప్పి తగ్గిపోతుంది.
3. గలిజేరు తీగ పాలంగట్లు మీద పెరుగుతుంది. దీనిని తెచ్చి బాగా ఎండించి, మెత్తగా దంచి, పాలలోగానీ, మజ్జిగలో గానీ కలుపుకుని త్రాగుతుంటే వంటికి పట్టిన నీరులాగేస్తుంది.
5. పునర్ణవారిష్ట, రోహితకారిష్ట, శాశీసభస్మ మండూరభస్మ, లోహభస్మ, గోక్షురాది చూర్ణం, చంద్ర ప్రభావటి, స్వర్ణవంగం, త్రివంగభస్మ వంటి చాలా మందులు ఆయుర్వేదం మందుల షాపులో దొరుకుతాయి. వీటిని వాడుతున్నా వంటికి పట్టిన నీరు లాగేస్తుంది.