కీటకాలు - పురుగులు కుట్టినచోట అరటి తొక్కతో రుద్దుకుంటే...

గురువారం, 30 ఆగస్టు 2018 (10:09 IST)
అరటి పండులో గల ఆరోగ్య విషయాలను తెలుసుకుందాం. దంతాల సంరక్షణకు అరటి పండు తొక్క చాలా ఉపయోగపడుతుంది. అరటి పండు తొక్కలో గల లోపలి భాగాన్ని దంతాలపై ప్రతిరోజూ రుద్దుకుంటే దంతాలు తెల్లగా మారుతాయి. కాలిన గాయాలు, దెబ్బలకు అరటి పండు తొక్క దివ్యౌషధంగా పనిచేస్తుంది. కాలిన గాయాలపై అరటి పండు తొక్కను ఉంచి కట్టులా కట్టుకోవాలి.
 
ఇలా ప్రతిరోజూ చేయడం వలన గాయాలు, దెబ్బలు మానిపోతాయి. అరటి పండులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. శరీరంలో ఏ భాగమైన నొప్పిగా ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో అరటి పండు తొక్కను కాసేపు మర్దన చేసుకోవాలి. ఇలా చేస్తే నొప్పుల నుండి వెంటనే ఉపశమనం లభిస్తుంది. పురుగులు, కీటకాలు కుట్టిన ప్రాంతాల్లో అరటి పండు తొక్కతో రుద్దుకుంటే మంచి ఫలితం ఉంటుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు