అల్‌బకరలో ఉండే విటమిన్ 'ఇ', బీటాకెరోటిన్, యాంటీఆక్సిడెంట్లు చర్మకణాలను ఫ్రీరాడికల్స్ బారినుంచి రక్షిస్తాయి. అలాగే దీనిలో యాంటీఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉండటం వల్ల, అవి వదులుగా మారిన చర్మాన్ని బిగుతుగా మారుస్తాయి. ఫలితంగా చర్మం ముడతలు పడకుండా యవ్వనంగా కనిపిస్తుంది.
కొంతమంది పెదవులు నల్లగా, అందవిహీనంగా ఉంటాయి. అలాంటి వారు అల్‌బకర్ పండ్లను తీసుకోవడం ద్వారా పెదవుల అందాన్ని మెరుగుపరుస్తుంది. దీంతోపాటు అల్‌బకర్ తొక్కతో పెదవులను కాసేపు సున్నితంగా మర్దన చేసుకోవాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే నల్లగా ఉన్న పెదవులు ఎర్రగా, మృదువుగా తయారవుతాయి.
మొటిమలను గిల్లడం, దెబ్బలు తగలడం లాంటి కారణాల వల్ల ఆయా ప్రదేశాల్లోని చర్మకణాలు పాడైపోతాయి. తిరిగి అక్కడ చర్మకణాలను ఉత్పత్తి చేయడానికి చర్మం కొలాజెన్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే కొన్నిసార్లు కొలాజెన్ తక్కువగా విడుదలవడం వల్ల అక్కడ చర్మకణాలు పూర్తిగా ఏర్పడవు. ఫలితంగా మచ్చలు ఏర్పడతాయి. అయితే అల్‌బకరను తినడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చునని న్యూట్రీషన్లు అంటున్నారు.