సబ్జాగింజల్లో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. క్యాలరీలు తక్కువగా ఉంటాయి. నానబెట్టిన సబ్జా గింజల్లోని యాంటీ ఆక్సిడెంట్స్ మధుమేహా వ్యాధిని అదుపులో ఉంచుతుంది. ఈ గింజల్లో పోషక విలువలు పుష్కలంగా ఉన్నాయి. ఈ గింజలను తరచుగా తీసుకోవడం వలన బరువు తగ్గుతారు. రక్తంలోని చక్కెర ప్రమాణాలను నియంత్రిస్తాయి. శరీరాన్ని అత్యంత సహజంగా డిటాక్స్ చేస్తాయి.
జీర్ణక్రియలు సాఫీగా జరుగుతాయి. శరీరంలోని కొవ్వును తగ్గిస్తుంది. గుండెల్లో మంట, ఎసిడిటీ బాధలను కూడా తగ్గిస్తాయి. శరీరం నుంచి వ్యర్థాలను బయటకు పంపేస్తాయి. సబ్జా గింజల్లో విటమిన్-కె, విటమిన్-ఎ, ప్రొటీన్, ఐరన్‌లు బాగా ఉన్నాయి. దగ్గు, ఫ్లూ జ్వర బాధలను తగ్గిస్తాయి. గర్భిణీలను సబ్జా గింజలు వాడొద్దంటారు. ఎందుకంటే ఆ సమయంలో అవి వారి శరీరంలోని ఈస్ట్రోజన్ హార్మోన్లను తగ్గిస్తాయట.