ప్రస్తుతం చిన్న పిల్లల దగ్గర నుండి, పెద్దవాళ్ళ వరకు జుట్టు రాలడం ఒక సమస్యగా మారిపోయింది. దీనిని చూసి అధైర్యపడొద్దు. ఈ జాగ్రత్తలు తీసుకోండి... వెంట్రుకలు రాలే సమస్య నుంచి కొంత ఉపశమనం పొందండి...
* మొట్టమొదటిగా ఎక్కువగా ఒత్తిడి , మానసిక ఆందోళనలు లేకుండా జాగ్రత్త పడాలి.
* రోజులో కనీస వ్యాయామం 30 నిముషాలు ఉండేలా చూసుకోవాలి.
* ఆహారంలో ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, పీచు ఎక్కువగా ఉన్న పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి.
* కనీసం ఒక రోజులో 10-12 గ్లాసుల నీటిని త్రాగాలి.
* కెమికల్ షాంపూ వాడకం, హెయిర్ డ్రైయర్ వాడకం బాగా తగ్గించాలి. కెమికల్ జెల్స్ , కెమికల్ షాంపూ వాడకం ఎక్కువైతే కుదుళ్ళు పటుత్వం కోల్పోయి, జుట్టు నిర్జీవంగా మారి జుట్టు ఊడిపోతుంది.
* చుండ్రు ఉన్నవాళ్లు , తల స్నానం చేసే అరగంట ముందు కొబ్బరి నూనె లో , నిమ్మరసం కలిపి కొద్దిగా వేడి చేసి , జుట్టుకు , కుదుళ్ళకు పట్టించి , మృదువుగా వేళ్ళను ఉపయోగిస్తూ , ఒక 5 నిముషాలు మసాజ్ చేసుకోవాలి.
* ఆహార సమయాలు కచ్చితంగా పాటిస్తూ , రోజులో కనీసం 7-8 గంటల నిద్ర ఉండాలి.
*ముఖ్యంగా క్యారట్ , బీట్రూట్ , ఆపిల్ , పాలు , గుడ్లు , చేపలు , ఆకుకూరలు , చిలగడదుంపలు , సోయాబీన్స్ , బీన్స్ , చిక్కుళ్ళు , ఖర్జూరాలు, అరటిపండు , బెర్రీ పండ్లు , మటన్ ఫ్లాష్ , పెరుగు , ఇలాంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలి. ఇలా పాటిస్తే , జుట్టురాలే సమస్య నుండి ఉపసమనం పొందవచ్చు.